Advertisement

ఫ్లాప్ ఇచ్చినా సినిమాలు ఇస్తాడు!

Sun 18th Oct 2015 02:02 AM
dil raju,flop movies,second chance,vaasu varma,venu sriram,vamsi paidipalli,harish shankar,dil raju directors,producer dil raju  ఫ్లాప్ ఇచ్చినా సినిమాలు ఇస్తాడు!
ఫ్లాప్ ఇచ్చినా సినిమాలు ఇస్తాడు!
Advertisement

అభిరుచి గల నిర్మాతగా, వైవిధమైన చిత్రాల ప్రొడ్యూసర్‌గా మొదట్లో దిల్ రాజుకు మంచి పేరుంది. ఆ తర్వాత  పరిస్థితుల కారణంగా ఆ పేరు కమర్షియల్ చిత్రాల నిర్మాతగా మారింది. మొదట్నుంచీ కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చే దిల్ రాజు ఇప్పటికీ అదే పద్ధతిని అనుసరిస్తున్నాడు.అయితే ఇటీవల కాలంలో ఫామ్‌లో వున్న దర్శకులతో సినిమాలు చేస్తున్న దిల్ రాజు తన సంస్థలో ఫ్లాప్ ఇచ్చిన కొత్త దర్శకులకు కూడా మరో అవకాశాన్ని ఇస్తున్నాడు. తన సంస్థలో జోష్ తో ఫ్లాప్ ఇచ్చిన వాసువర్మ ప్రస్తుతం సునీల్‌తో కృష్ణాష్టమి చేసే అవకాశాన్ని, ఓమై ఫ్రెండ్ తో అపజయాన్ని చవిచూసిన వేణుశ్రీరామ్‌కు రవితేజతో సినిమా చేసే అవకాశాన్ని మరో సారి తన సంస్థలో కల్పించాడు. అంతేకాదు గతంలో మున్నా తో సక్సెస్ కానీ వంశీ పైడిపల్లికి బృందావనం తో మరో అవకాశాన్ని ఇచ్చి సక్సెస్‌ను ఇచ్చాడు. ఇటీవల కాలంలో రామయ్యా వస్తావయ్యాతో తన సంస్థకు ఫ్లాఫ్ ఇచ్చిన హరీష్ శంకర్‌కు సుబ్రమణ్యం ఫర్ సేల్ తో మరో ఛాన్స్ ఇచ్చాడు..సో.. సాధారణంగా ఓ ఫ్లాప్ వస్తే మళ్లీ ఆ దర్శకుడిని పట్టించుకోని నిర్మాతలు వున్న మన తెలుగు సినీ పరిశ్రమలో తన సంస్థలో ఫ్లాప్‌లు ఇచ్చినా.. వారికి దిల్ రాజు మరో అవకాశం ఇవ్వడం నిజంగా గ్రేట్ అంటున్నారు సినీజనాలు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement