రానాతో మెగా హీరోయిన్ ..!

Tue 29th Sep 2015 08:36 AM
regina,rana,suresh babu,subramanyam for sale  రానాతో మెగా హీరోయిన్ ..!
రానాతో మెగా హీరోయిన్ ..!
Sponsored links

బాహుబలి తర్వాత సోలోహీరోగా నటించి సక్సెస్‌ కావాలని రానా విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే సోలోహీరోగా నటించేందుకు సరైన స్టోరీలు సిద్దం చేయించడం కోసం కొందరు రచయితలకు ఆ పని పురమాయించాడు. అందులో భాగంగానే కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌రక్షిత్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలని డిసైడ్‌ అయ్యాడు. ఈ చిత్రాన్ని సురేష్‌ప్రొడక్షన్స్‌ పతాకంపై డి.సురేష్‌బాబు నిర్మిచనున్నాడు. కాగా ఇందులో రానాకు జోడీగా రెజీనాను ఎంపిక చేసుకున్నారు. ఇటీవల విడుదలైన సుబమణ్యం ఫర్‌ సేల్‌ చిత్రం ద్వారా రెజీనాకు మంచి మార్కులు పడ్డాయి. తనదైన నటనతో ఆమె ప్రేక్షకులను మెప్పించింది. సీతగా నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక గ్లామర్‌డోస్‌ పెంచడం కూడా ఈ భామకు కలిసొచ్చింది. అందువల్లే రానాకు జోడీగా ఆమెను ఎంచుకున్నారు. త్వరలో ఈ చిత్రం విషయంలో సురేష్‌ప్రొడక్షన్స్‌ నుండి ఓ అధికారిక ప్రకటన రానుంది. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019