Advertisementt

రామచరణ్‌ వార్నింగ్‌...!

Wed 16th Sep 2015 08:33 AM
ram charan,surendar reddy,kick2,ravi teja  రామచరణ్‌ వార్నింగ్‌...!
రామచరణ్‌ వార్నింగ్‌...!
Advertisement
Ads by CJ

కిక్‌2 ఎఫెక్ట్‌ అందరి కంటే ఎక్కువగా దర్శకుడు సురేందర్‌రెడ్డికి తగిలింది. దీంతో ఆయన త్వరలో చేయబోయే చిత్రం విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి కిక్‌2 తర్వాత సురేందర్‌రెడ్డితో సినిమా చేయడానికి రామ్‌చరణ్‌ ఒప్పుకున్నాడు. అయితే కిక్‌2 విజయం సాధించకపోయినా రామ్‌చరణ్‌ మాత్రం ఆయనతోనే సినిమా చేయడానికి అంగీకరించాడట. కానీ ఈ చిత్రం విషయంలో రామ్‌చరణ్‌ సురేందర్‌రెడ్డికి షరతుల మీద షరతులు పెడుతున్నాడని తెలుస్తోంది. స్క్రిప్ట్‌ మొత్తం పూర్తి చేసి చూపించాలని, ఒక్కసారి స్క్రిప్ట్‌ లాక్‌ చేశాక ఇక అందులో ఏమాత్రం మార్పులు చేర్పులు చేయడానికి లేదని చెప్పాడట. కథ నచ్చకపోతే ఏ క్షణంలో అయినా ఈ సిసిమా నుండి తప్పుకుంటాననే షరతు కూడా విధించాడట. అయితే వీటన్నింటికి సురేందర్‌రెడ్డి ఓకే చెప్పినట్లు సమాచారం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ