Advertisementt

విడాకుల ఖరీదు 19 కోట్లా!

Mon 14th Sep 2015 03:46 AM
eega,bahubali,sudeep,priya radhakrishnan,divorce case  విడాకుల ఖరీదు 19 కోట్లా!
విడాకుల ఖరీదు 19 కోట్లా!
Advertisement
Ads by CJ

కన్నడంలో స్టార్ హీరోగా కెరీర్ సాగిస్తూ ఇప్పుడు దక్షిణాదిలోని పాపులర్ అవుతున్న నటుడు సుదీప్. అయితే రీసెంట్ గా ఈ స్టార్ తన భార్యకు విడాకులిచ్చి వార్తల్లో నిలిచాడు. అసలు విషయానికొస్తే తన భార్య ప్రియా రాధకృష్ణన్ కు సుదీప్ కు మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో గత కొంతకాలంగా వీరిద్దరూ సెపరేట్ గా ఉంటున్నారు. కారణం చెప్పకుండా విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం సుదీప్ ఆమెకు 19 కోట్ల రూపాయలు భరణంగా చెల్లించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరికి 11 ఏళ్ల అమ్మాయి కూడా ఉంది. కూతురు సంరక్షణ కూడా భార్యకే అప్పగించాడట. సినిమాల పట్ల ఆసక్తితో  మొదట దర్శకుడిగా పని చేసిన సుదీప్.. ఆ తరువాత హీరోగా మారి సక్సెస్ సాధించాడు. తెలుగులో ఈగ సినిమాతో పాపులర్ అయిన సుదీప్ బాహుబలిలోనూ రెండు నిమిషాలు మెరిశాడు. త్వరలోనే దక్షినాదిలోని అన్ని భాషల్లో హీరోగా నటించడానికి ప్లాన్ చేస్తున్నాడట..! 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ