Advertisementt

మూడో సీజన్ కు నాగ్‌ డేట్స్ ఇచ్చేసాడు..!

Thu 10th Sep 2015 12:38 AM
nagarjuna,meelo evaru koteeshwarudu,third season  మూడో సీజన్ కు నాగ్‌ డేట్స్ ఇచ్చేసాడు..!
మూడో సీజన్ కు నాగ్‌ డేట్స్ ఇచ్చేసాడు..!
Advertisement
Ads by CJ

చిన్నితెరపై సంచలనాలు సృష్టిస్తూ, వీక్షకులు ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న కార్యక్రమం మీలో ఎవరు కోటీశ్వరుడు. మొదటి రెండు సీజన్లు అద్బుతమైన ఆదరణ చూరగొనడంతో ఇప్పుడు మూడో సీజన్‌కు తెరతీస్తున్నారు. ఈ విషయంలో నాగార్జున కూడా మరింత రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. ఈసారి కూడా గతంలోలాగానే స్టార్‌ ఇమేజ్‌కు పెద్ద పీట వేయనున్నారని సమాచారం. అక్టోబర్‌ నుంచి ఈ షో మొదలుకానుంది. ఈ విషయంపై నాగార్జున మాట్లాడుతూ.... నేను 60 ఎపిసోడ్లు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాను. డేట్స్‌ కూడా ఖరారు అయ్యాయి. ఇందుకోసం నేను చేస్తున్న సినిమాలు కూడా పూర్తి చేసి డేట్స్‌ ఖాళీ చేసుకుంటున్నాను.. అని తెలిపాడు. మరి ఈ మూడో సీజన్‌లో కూడా ఈ కార్యక్రమం మాటీవీలో ఎన్ని అద్బుతాలు సృష్టిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ