నాగ్‌ గెస్ట్‌రోల్‌ కి ఓకే చెప్పాడు!

Fri 28th Aug 2015 11:05 AM
nagarjuna,guest role,nirmala convent movie,roshan,srikanth  నాగ్‌ గెస్ట్‌రోల్‌ కి ఓకే చెప్పాడు!
నాగ్‌ గెస్ట్‌రోల్‌ కి ఓకే చెప్పాడు!
Advertisement
Ads by CJ

అనుష్క నటిస్తోన్న 'సైజ్‌జీరో' చిత్రంలో నాగార్జున అతిథి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో చిత్రంలో కూడా అతిథి పాత్ర చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ త్వరలో 'నిర్మలాకాన్వెంట్‌' చిత్రం పట్టాలెక్కనుంది. ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.ఈ చిత్రానికి వీలైనంత క్రేజ్‌ సంపాదించే ప్రయత్నంలో భాగంగా ఈ చిత్రంలో నాగ్‌ గెస్ట్‌రోల్‌ చేయనున్నాడట. అది కూడా శ్రీకాంత్‌ రిక్వెస్ట్‌ కు స్పందించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. నాగ్‌ నటిస్తుంటే ఆ చిత్రానికి వచ్చే క్రేజే వేరుగా ఉంటుంది. ఈ అంశం సినిమా బిజినెస్‌కు కూడా బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతోనే నాగ్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ