Advertisementt

అనుష్క శెట్టి మోసం చేస్తుందా?

Thu 27th Aug 2015 08:06 AM
anushka shetty,size zero movie,anushka in size zero movie,bahubali,rudhramadevi  అనుష్క శెట్టి మోసం చేస్తుందా?
అనుష్క శెట్టి మోసం చేస్తుందా?
Advertisement
Ads by CJ

హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాందించుకున్న అందాల సుందరి అనుష్క త్వరలో విడుదల కానున్న ‘సైజ్‌జీరో’ చిత్రంలో బొద్దుగుమ్మగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్‌ను ఇటీవలే ఒక్కొక్కటి విడుదల చేస్తున్నారు. ఈ పోస్టర్స్‌లో అనుష్కను చూసిన వాళ్లంతా అనుష్క నిజంగానే ఇంత లావు అయ్యిందా లేక మేకప్ ట్రిక్‌తో అలా కనిపిస్తుందా? అనే సందేహలను వ్యక్తం చేస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ సభ్యులతో పాటు అనుష్క కూడా సహజంగానే  డైట్ నియమాలు పాటించకుండా.. ఎక్కువసార్లు ఆహారాన్ని తీసుకొని ఈ చిత్రం కోసం బరువు పెరిగిందని అంటున్నారు. అయితే అనుష్క గత కొంతకాలం నుంచి ఆడపా దడపా మీడియాలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా సైజ్‌జీరోతో పాటు తమిళ చిత్రం తెలుగులో బాహుబలి, రుద్రమదేవి చిత్రాల్లో ఏకకాలంలో నటించింది. ఈ గ్యాప్‌లో అనుష్క ఎప్పుడు లావైనట్లు.. ఎప్పుడు తగ్గినట్లు సినీజనాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే  అనుష్క స్వతహాగా యెగా టీచర్ కావడంతో బరువు పెరగడం, తగ్గడం ఆమెకు చాలా ఈజీ అని కూడా అంటున్నాయి చిత్రవర్గాలు. అయితే ఒక వర్గం మాత్రం అనుష్క నిజం చెప్పకుండా ప్రేక్షకులను మోసం చేస్తుందని కూడా ఆరోపిస్తున్నారు. ఇందులో ఏది నిజమో.. సినిమా విడుదల తర్వాతనైనా తెలుస్తుందేమో వేచి చూద్దాం.  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ