Advertisementt

శ్రియ క్రేజ్‌ను వాడుకొనే ప్రయత్నం!

Fri 21st Aug 2015 05:55 AM
sriya,drusyam,hindi remake,pavithra movie,jismki aag2  శ్రియ క్రేజ్‌ను వాడుకొనే ప్రయత్నం!
శ్రియ క్రేజ్‌ను వాడుకొనే ప్రయత్నం!
Advertisement
Ads by CJ

'దృశ్యం' చిత్రం మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ్‌లో మంచి విజయం సాధించింది. అదే నమ్మకంతో ఈచిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేశారు. మీనా నటించిన పాత్రను ఇందులో శ్రియ పోషించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. బాలీవుడ్‌లో ఒక్క హిట్టు కోసం పరితపించిపోతున్న శ్రియకు ఈ సినిమా అనుకోని వరంలా తగిలింది. శ్రియకు అక్కడ కాస్త క్రేజ్‌ వచ్చింది. ఈ తరహా పాత్రలకు శ్రియను ఓ మంచి ఆప్షన్‌ అని దర్శకనిర్మాతలు నమ్ముతున్నారు. అయితే ఓ నిర్మాత మాత్రం శ్రియ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకొనే ప్రయత్నంలో ఉన్నాడు. అప్పుడెప్పుడో తెలుగులో విడుదలై అట్టర్‌ఫ్లాప్‌ అయిన 'పవిత్ర' సినిమాని ఆయన హిందీలో డబ్‌ చేస్తున్నాడు. 'దృశ్యం' చూసిన కళ్లతో ఈ సినిమా చూస్తే జనాలు బెంబేలెత్తిపోవడం ఖాయం. కానీ శ్రియ పోస్టర్‌ చూసి జనాలు థియేటర్‌కి వస్తారని సదరు నిర్మాత నమ్మకంగా ఉన్నాడు. ఈ కళాఖండానికి 'జిస్మ్‌కి ఆగ్‌2' అనే టైటిల్‌ కూడా పెట్టాడు. మరి ఈ డబ్బింగ్‌ సినిమా ఏ రేంజ్‌లో ఆడుతుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడాలి...! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ