Advertisementt

రానా ఆనందానికి అవధుల్లేవు!

Thu 20th Aug 2015 12:33 PM
rana,bahubali,rajamouli,bhallaladeva,super star  రానా ఆనందానికి అవధుల్లేవు!
రానా ఆనందానికి అవధుల్లేవు!
Advertisement
Ads by CJ

'బాహుబలి'తో ప్రభాస్‌కి ఎంత కలిసొచ్చిందో తెలీదు గానీ, రానా మాత్రం అటు ఇటు రెండు విధాలుగా లాభపడుతున్నాడు. 'బాహుబలి'ని రానా పేరుతోనే హిందీలో మార్కెట్‌ చేశాడు రాజమౌళి. అక్కడ ఈ చిత్రం 100కోట్లు కొల్లగొట్టింది. దాంతో ఒక్కసారిగా బాలీవుడ్‌ స్టార్‌ అయిపోయాడు. అంతకు ముందు ఆయన హిందీ చిత్రాల్లో నటించినప్పటికీ అవ్వన్నీ చిన్న చిన్నపాత్రలే. దాంతో భళ్లాలదేవగా ఆయన పేరు అక్కడ మారుమోగుతోంది. తమిళ, తెలుగు భాషల్లోనూ రానా రేంజ్‌ పెరిగింది. దాంతో రానాని మీడియా వారు సూపర్‌స్టార్‌ అంటూ కితాబు ఇచ్చేస్తున్నారు. దీంతో రానా కాస్త కంగారుపడ్డాడు. నన్ను సూపర్‌స్టార్‌ అని పిలవ వద్దు. సూపర్‌స్టార్ల రేంజ్‌ వేరు. నేను నటుడిని మాత్రమే. స్టార్‌ హోదా అప్పుడే నాకు ఇవ్వొద్దు... అంటున్నాడు. ఇవ్వొద్దు.. అంటున్నాడు గానీ తనకు మాత్రం అలా పిలిపించుకోవడం ఆనందంగా ఉండదా? ఏంటి? మనసులో ఆయన ఎంతగా సంతోషపడుతున్నాడో ఈ భళ్లాలదేవ...! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ