Advertisementt

'కొరియర్‌ బోయ్‌'ని సిద్దం చేస్తున్నారు!

Mon 10th Aug 2015 08:09 AM
courier boy kalyan,nithin,gowtham menon,trivikram  'కొరియర్‌ బోయ్‌'ని సిద్దం చేస్తున్నారు!
'కొరియర్‌ బోయ్‌'ని సిద్దం చేస్తున్నారు!
Advertisement
Ads by CJ

నితిన్‌ హీరోగా గౌతమ్‌మీనన్‌ నిర్మాణంలో ప్రభుదేవా వద్ద డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన ప్రేమ్‌సాయి దర్శకత్వంలో అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల కిందట 'కొరియర్‌ బోయ్‌ కళ్యాణ్‌' చిత్రం రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. మొదట్లో కొంచెం షూటింగ్‌ను పూర్తి చేసుకొని ఆగిపోయిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు ఏదోవిధంగా పూర్తిచేశారు. వాస్తవానికి నితిన్‌ సినిమా వచ్చి చాలారోజులైంది. కొత్త సినిమా రావడానికి వచ్చే వేసవి పడుతుంది. అది కూడా త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో చేసే సినిమా కావడంతో ఈ గ్యాప్‌ను ఉపయోగించుకుని 'కొరియర్‌బోయ్‌ కల్యాణ్‌'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రంగం సిద్దం అవుతోంది. ఈ చిత్రంలో యామీ గౌతమ్‌ హీరోయిన్‌గా నటించగా, ప్లేబ్యాక్‌ సింగర్‌ కార్తీక్‌ సంగీతాన్ని అందించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు చేయాల్సిన రిపేర్స్‌ పూర్తయ్యాయని సమాచారం. ఈ సినిమా ఆడియోను ఈ నెల 16న విడుదల చేసి సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కాగా ఈచిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏకకాలంలో నిర్మించారు. ఒకే రోజున ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. మరి లేట్‌గా వస్తోన్న ఈ 'కొరియర్‌బాయ్‌ కళ్యాణ్‌' ఏమాత్రం లేటెస్ట్‌గా వస్తాడో వేచిచూడాల్సివుంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ