మెగాహీరో మూవీలో రావు రమేష్ హైలైట్ అట!

Fri 07th Aug 2015 04:18 AM
rao ramesh,character artist,ram charan,stunt master role  మెగాహీరో మూవీలో రావు రమేష్ హైలైట్ అట!
మెగాహీరో మూవీలో రావు రమేష్ హైలైట్ అట!
Sponsored links

తెలుగులో ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా బిజీగా మారిన టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌ రావురమేష్‌కు ఇప్పుడు మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. అలా ఆయన శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా చేస్తున్న చిత్రంలో కీలకపాత్ర చేస్తున్నాడు. రామ్‌చరణ్‌కు తండ్రి పాత్రలో ఆయన నటిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్ర సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుందని అంటున్నారు. తండ్రికి ఇచ్చిన మాట కోసం సోదరి కుటుంబాన్ని సరిదిద్దే ఓ స్టంట్‌మేన్‌ పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నాడు. ఇందులో రామ్‌చరణ్‌, రావు రమేష్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు మంచి సెంటిమెంట్‌తో నిండి, ఫ్యామిలీ, మహిళా ప్రేక్షకులను బాగా అలరిస్తాయని యూనిట్‌సభ్యులు అంటున్నారు. మొత్తానికి 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర కావాలని భావించిన రామ్‌చరణ్‌ కోరికను ఈ చిత్రం తీరుస్తుందని యూనిట్‌ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019