Advertisementt

మహేష్‌కు ఇష్టం లేదట!

Tue 04th Aug 2015 03:58 AM
mahesh babu,sreemanthudu,bahubali,tickets,special shows  మహేష్‌కు ఇష్టం లేదట!
మహేష్‌కు ఇష్టం లేదట!
Advertisement

'బాహుబలి' విడుదల సమయంలో అభిమానులు నిలువుదోపిడీకి గురైన సంగతి తెలిసిందే. సినిమా చూడాలనే అభిమానుల బలహీనతను క్యాష్‌ చేసుకున్నారు థియేటర్ల యాజమాన్యాలు. టికెట్లను బ్లాక్‌ చేసి బ్లాక్‌లో వేల రూపాయలకు అమ్మారు. ఛారిటీ పేరు చెప్పి ఆ డబ్బంతా అక్రమంగా తమ జేబుల్లో వేసుకున్నారు. ఈ విషయం బాగా వివాదాస్పదమైంది. మీడియాలో హాట్‌టాపిక్‌ అయింది. 'శ్రీమంతుడు' విషయంలో అలా జరుగకూడదని మహేష్‌ భావిస్తున్నాడట. సినిమా విడుదలకు ఒక రోజు ముందే స్పెషల్‌ షో వేయడం, ఛారిటీ పేరు చెప్పి అభిమానులను నిలువుదోపిడీ చేయడం ఆయనకు నచ్చలేదట. ఒకవేళ స్పెషల్‌ షోలు వేసినా మామూలు టిక్కెట్ల రేట్లను మాత్రమే వసూలు చేయాలని ఆయన కోరుకుంటున్నట్లు సమాచారం. ఈ వార్తే నిజమైతే మహేష్‌ నిర్ణయాన్ని అందరూ సమర్థించాల్సిన అవసరం ఉంది...! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement