Advertisementt

అఖిల్‌ 'తాండవం' చేయనున్నాడా?

Tue 04th Aug 2015 03:53 AM
akhil vinayak,missile,thandavam,satellite rights  అఖిల్‌ 'తాండవం' చేయనున్నాడా?
అఖిల్‌ 'తాండవం' చేయనున్నాడా?
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్‌ హీరోగా పరిచయం అవుతూ వినాయక్‌ దర్శకత్వంలో హీరో నితిన్‌ తండ్రి సుధాకర్‌రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్‌ను ఇంకా ప్రకటించలేదు. కొంతకాలం కిందట ఈ సినిమాకు 'మిస్సైల్‌' అనే టైటిల్‌ను పెట్టనున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి 'తాండవం' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రెండిరటిలో ఏదైనా ఫిక్స్‌ చేస్తారా? లేక మరో కొత్త టైటిల్‌ను ఎంచుకుంటారా? అనేది తేలాల్సివుంది. కాగా ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌ టీజర్‌ను కూడా నాగార్జున పుట్టినరోజు కానుకగా ఆగష్టు 29న విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఆడియోను అక్కినేని జయంతి సందర్భంగా సెప్టెంబర్‌ 20న విడుదల చేయనున్నారు. సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 21న విడుదల చేయనున్నారని సమాచారం. ఇక మరో విశేషం ఏమిటంటే నాగార్జున చిత్రాలకు శాటిలైట్‌ రైట్స్‌ రేటు 5కోట్లకు ఇప్పటివరకు మించలేదు. కానీ అఖిల్‌ సినిమాను 6.5 కోట్లకు జెమినీ, 7కోట్లకు మా టీవీలు కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నాయని, జీ తెలుగు కూడా ఈ చిత్రం శాటిలైట్‌ హక్కుల కోసం గట్టిగా పోటీపడుతోందని, మొత్తానికి తన తొలి సినిమాతోనే తండ్రిని మించిన తనయుడు అనిపించుకునేందుకు అఖిల్‌ రెడీ అవుతున్నాడని అక్కినేని అభిమానులు సంతోషంగా ఉన్నారు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ