Advertisement

తెలుగు పరిశ్రమపై సాయికుమార్ అసంతృప్తి!

Fri 24th Jul 2015 12:18 PM
sai kumar,police story,dialogue king,telugu industry  తెలుగు పరిశ్రమపై సాయికుమార్ అసంతృప్తి!
తెలుగు పరిశ్రమపై సాయికుమార్ అసంతృప్తి!
Advertisement

తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, టెలివిజన్‌ యాంకర్‌గా, ‘పోలీస్‌స్టోరీ’ చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా అద్భుతమైన పాత్రను పోషించిన సాయికుమార్‌ విజయవాడ పోలీస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా నియమితులయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమలో తనకు దక్కాల్సిన గుర్తింపు తనకు దక్కలేదని, కన్నడ సినీ పరిశ్రమ గుర్తించినంతగా తనను తెలుగు పరిశ్రమ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కన్నడంలో ఏడాదికి ఏడెనిమిది సినిమాల్లో హీరోగా చేస్తున్న సమయంలో కూడా తెలుగు దర్శకనిర్మాతలు తనని కేవలం డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానే చూశారని, తెలుగులో ‘పోలీస్‌స్టోరీ’ చిత్రం రాకుండా ఉంటే ఇప్పటికే తనను ఇక్కడి వారు మర్చిపోయి ఉండేవారని ఆయన అంటున్నాడు. తన టాలెంట్‌కు తగ్గ గుర్తింపు తెలుగులో తనకు రానందుకు ఆయన మాటల్లో ఎంతో బాధ కనిపిస్తోంది అని ఆయన సన్నిహితులు కూడా వాపోతున్నారు. అయితే పలువురు ఫిల్మ్‌మేకర్స్‌ మాత్రం ఆయనకు తగిన గుర్తింపు ఇచ్చామని అంటున్నారు. మొత్తానికి పరభాషా నటులకు ఇచ్చే గుర్తింపు, విలువ మన నటులకు ఇవ్వకపోవడం తప్పేనని ఒప్పుకోవాలి!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement