ప్రభాస్‌ హ్యాండిస్తేనేం.. నితిన్‌ ఉన్నాడుగా!

Sat 25th Jul 2015 04:19 AM
prabhas,sujeeth,nithin,bahubali,trivikram sreenivas  ప్రభాస్‌ హ్యాండిస్తేనేం.. నితిన్‌ ఉన్నాడుగా!
ప్రభాస్‌ హ్యాండిస్తేనేం.. నితిన్‌ ఉన్నాడుగా!
Sponsored links

‘బాహుబలి’ చిత్రం పూర్తయిన వెంటనే ‘రన్‌ రాజా రన్‌’ డైరెక్టర్‌ సుజీత్‌ ప్రభాస్‌తో సినిమా చేయాలని ఎప్పటినుండో ఆశపడుతూ ఉన్నాడు. కానీ ప్రభాస్‌కు ‘బాహుబలి2’ చిత్రంలో ఇంకా షూటింగ్‌ పెండింగ్ ఉండటంతో దాన్ని పూర్తి చేసే దాకా మరో చిత్రం వద్దనుకున్నాడు. దాంతో సుజీత్‌తో సినిమాను ప్రభాస్‌ పక్కనపెట్టాడు. దీంతో దర్శకుడు సుజీత్‌ ప్రబాస్‌తో చేయానుకున్న సినిమాను నితిన్‌ హీరోగా చేయాలని సిద్దమైపోయాడు. దానికి నితిన్‌ కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడు. అయితే ఆల్‌రెడీ నితిన్‌ నిర్మాత మల్లిడి సత్యనారాయణరెడ్డి కుమారుడు వేణు దర్శకత్వంలో ఓ సినిమా కమిట్‌ అయివున్నాడు. అయితే నితిన్‌తో సినిమా విషయంపై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమా ఉంటుందో వుండదో తేలేదాకా ఎవ్వరి సినిమా ఎప్పుడు మొదలుపెట్టాలో తెలియని స్థితిలో నితిన్‌ ఉన్నాడు. త్రివిక్రమ్‌తో సినిమా విషయంలో ఓ క్లారిటీ వస్తే గానీ ఈ రెండు చిత్రాలలో ఏది మొదటగా చేస్తాడో చెప్పలేని స్థితిలో నితిన్‌ ఉన్నాడంటున్నారు!

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019