మహేష్‌ కోసం రాక్‌ సింగర్‌!

CineJosh news

సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్‌ తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపిస్తుంటాడు.  ఆయన ఇటీవల వచ్చిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ ద్వారా పాపులర్‌ సింగర్‌ రఘు దీక్షిత్‌ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేశాడు. అయితే ఆ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో అతను పెద్దగా నోటెడ్‌ కాలేదు. తాజాగా మహేష్‌ నటిస్తున్న ‘శ్రీమంతుడు’ చిత్రంలో ఓ రాక్‌సాంగ్‌కు అవకాశం ఉండటంతో దానిని రఘుదీక్షిత్‌తోనే పాడించాడట. ఈ చిత్రం మొత్తానికి ఈ పాట హైలైట్‌ అవుతుందని అంటున్నారు.  ఈ చిత్రం ఆడియో ఈ నెల 18న విడుదలకానుంది.

mahesh bau
devisriprasad
srimanthudu
raghu dixit