మళ్లీ సినిమాల్లోకి వచ్చిన పాత హీరోయిన్‌..!!

Sat 27th Jun 2015 08:27 AM
jayapradha,amar singh,tamil film,producer  మళ్లీ సినిమాల్లోకి వచ్చిన పాత హీరోయిన్‌..!!
మళ్లీ సినిమాల్లోకి వచ్చిన పాత హీరోయిన్‌..!!
Advertisement

తెలుగునుంచి అటు బాలీవుడ్‌కి అక్కడినుంచి రాజకీయాల్లోకి వెళ్లి యూపీలో స్థిరపడ్డ జయప్రద ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టిసారించారు. అప్పుడప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కనిపిస్తున్న ఆమె ఇప్పుడు పూర్తిస్థాయిలో సినిమాలపై దృష్టి కేంద్రీకరించానే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఓ సినిమాను ప్రొడ్యూస్‌ చేయడానికి ఆమె సన్నాహాలు చేస్తున్నారు.

సమాజ్‌వాది పార్టీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా.. యూపీలోని రాంపూర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా పనిచేసిన జయప్రద గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఇప్పుడు ఖాళీగా ఉన్న ఆమె మళ్లీ సినిమాలపై దృష్టి కేంద్రీకరించారు. అందులో భాగంగానే తన సోదరి కుమారుడు సిద్ధూను హీరోగా పరిచయం చేస్తూ తమిళంలో ఉయిరి ఉయిరె అనే సినిమాను జయప్రద నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను ప్రముఖ రాజకీయవేత్త అమర్‌సింగ్‌ సమర్పిస్తుండటం మరో విశేషం.


Loading..
Loading..
Loading..
advertisement