Advertisementt

రివ్యూలపై మండిపడ్డ కమెడియన్‌..!

Fri 26th Jun 2015 10:03 AM
reviews,thamil star comedian,vadivelu,eli movie   రివ్యూలపై మండిపడ్డ కమెడియన్‌..!
రివ్యూలపై మండిపడ్డ కమెడియన్‌..!
Advertisement
Ads by CJ

రివ్యూలు బాగా రాస్తే మెచ్చుకుంటారో లేదో తెలియదు కానీ, రివ్యూలు బాగా రాకపోతే మాత్రం రివ్యూలపై మండిపడటం సినిమా నటులకు కామన్‌ అయిపోయింది. ఈ ట్రెండ్‌ ఇటీవలే టాలీవుడ్‌లో స్టార్ట్‌ అయింది. ఇప్పుడు తమిళ స్టార్‌ కమెడియన్‌ వడివేలు విషయంలో వేడెక్కింది. ఆయన తన తాజా చిత్రం ‘ఎలి’పై సరైన రివ్యూలు రాలేదని మండిపడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ఎలి’ సినిమాకు సంబంధించి ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసు. విడుదలకు ముందు కూడా ఇబ్బందులు తలెత్తాయి. వాటన్నింటిని అధిగమించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చాం. జనాలకు బాగానే నచ్చింది. చాలామంది పాజిటివ్‌ రివ్యూలు రాశారు. కానీ కొంతమందికి ఏమైందో తెలియదు. చాలా నెగటివ్‌గా రాశారు. వాళ్ల వెనుక ఎవరో ఉన్నారు. బహుశా వాళ్లను ఏమైనా ఎలుక (ఎలి) కరిచిందేమో.. ఇలాంటి రివ్యూలు రాసేవారు సైకోలు, శాడిస్టులు అంటూ తన అక్కసును మొత్తం వెళ్లగక్కాడు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ