Advertisementt

దిల్‌రాజుకు ఆందోళన మొదలైందట...!

Tue 16th Jun 2015 05:56 AM
dil raju,kerintha,happydays,sindicate,mouth talk  దిల్‌రాజుకు ఆందోళన మొదలైందట...!
దిల్‌రాజుకు ఆందోళన మొదలైందట...!
Advertisement
Ads by CJ

దిల్‌రాజు... ఇండస్ట్రీలో పేరు మోసిన నిర్మాత. ‘ఆ నలుగురు’లో ఒకడు. ‘ఆ పద్నాలుగు మంది’ సిండికేట్‌కు లీడర్‌. అలాంటి నిర్మాతకే చమటలు పట్టి ఆందోళనకు గురయ్యే సంఘటన జరిగిందట. ఆయన నిర్మించిన ‘కేరింత’ చిత్రం శుక్రవారం విడుదలైంది. సినిమా మొదటిషోకు థియేటర్లలో ప్రేక్షకులు లేరనే విషయం తెలిసింది. దీంతో ఆయన చిన్న సినిమా తీసి తప్పు చేశానా ? అని ఆందోళన చెందాడట. మరోవైపు సిండికేట్‌ వ్యవహారం, యాడ్స్‌ ఇచ్చే విషయంలో నిబంధలను వల్ల మీడియాలోని అధికభాగం మంది ఆయనపై గుర్రుగా ఉన్నారు. మరి సాయంత్రానికి వారిచ్చే రివ్యూలు ఎలా ఉంటాయో? అనేది మరో టెన్షన్‌. ఎందుకుంటే ‘హ్యాపీడేస్‌’ పరిస్థితులు ఇప్పుడు లేవు. సినిమా హిట్‌ అనే టాక్‌ వస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. దాంతో ఆరోజు ఆయన పడిన టెన్షన్‌ అంతా ఇంతా కాదట....! మరి సినిమా బాగుందని రివ్యూలు వచ్చినా ఇప్పటికీ థియేటర్లలో మాత్రం జనాలు లేరు. సో.. కేవలం ఆయన తన సినిమాకు వచ్చిన ‘మౌత్‌టాక్‌’ అనే ఆయుధం మీదనే ఆధారపడ్డాడు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ