‘గబ్బర్‌సింగ్‌2’కు టైటిల్‌ మారనుందా...?

పవన్‌కళ్యాణ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘గబ్బర్‌సింగ్‌2’ రెగ్యులర్‌ షూటింగ్‌ ఇటీవల అంటే మే 29 నుండి మహారాష్ట్రలోని మల్షెజా ఘాట్స్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ జూన్‌ 5తో ముగిసింది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన లాంగ్‌ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో పవన్‌ కూడా షూటింగ్‌లో జాయిన్‌ అవుతున్నాడు. కాగా ఈ చిత్రంలో అనీషా ఆంబ్రోస్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, రెండో హీరోయిన్‌ కోసం ఎంపిక కసరత్తులు చేస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘గబ్బర్‌సింగ్‌2’ కంటే ‘సర్ధార్‌’ అనే టైటిలే బాగా యాప్ట్‌ అవుతుందని యూనిట్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలోని ఫ్లాష్‌బ్యాక్‌లో పవన్‌ గెడ్డంతో కనిపిస్తాడని, నిన్నటివరకు ఆయన పెంచిన గడ్డం షూటింగ్‌ కోసమే అని తెలుస్తోంది. మొత్తానికి పవన్‌కు ‘సర్ధార్‌’ అనే టైటిల్‌ మాత్రం ఆయన ఇమేజ్‌కు కరెక్ట్‌గా సూట్‌ అవుతుందని చెప్పవచ్చు.
pawan kalyan
gabbar singh2
anisha ambrose
sardhar