Advertisementt

పేరు మార్చుకుంటే ఫేట్‌ మారుతుందా...?

Fri 05th Jun 2015 07:04 AM
ram shankar,poorijagannath,bumper offer,vadu nenu kadu  పేరు మార్చుకుంటే ఫేట్‌ మారుతుందా...?
పేరు మార్చుకుంటే ఫేట్‌ మారుతుందా...?
Advertisement
Ads by CJ
దర్శకుడు పూరీజగన్నాథ్‌ తమ్ముడు సాయిరాంశంకర్‌ హీరోగా పరిచయమై దాదాపు 10ఏళ్లు దాటింది. ‘143’తో హీరోగా పరిచయమైన ఆయన కెరీర్‌లో ‘బంపర్‌ఆఫర్‌’ తప్ప చెప్పుకోదగిన చిత్రంలేదు. చివరకు పూరీ అండదండలు పుష్కళంగా ఉన్నప్పటికీ ఆయనను పట్టించుకునే నాధుడు కనిపించడం లేదు. ఈసారి ఆయన మరో ప్రయత్నం చేస్తున్నాడు. వినోద్‌ విజయన్‌ దర్శకత్వంలో ‘వాడు నేను కాదు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం నుండి సాయిరాంశంకర్‌ తన పేరును కూడా మార్చుకున్నాడు. ఇక నుండి ఈ హీరోను రాంశంకర్‌ అని పిలవాలట. సెంటిమెంట్‌గా ఆలోచించి ఈ పేరైతేనే ఆయనకు కలిసి వస్తుందని పేరు మార్చారు. మరి ఈ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందో లేదో చూడాలి...! 
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ