Advertisementt

కోరికలు తీర్చుకొంటున్న శృతి..!

Fri 05th Jun 2015 06:58 AM
sruthihasan,gabbar is back,range rover,bombay  కోరికలు తీర్చుకొంటున్న శృతి..!
కోరికలు తీర్చుకొంటున్న శృతి..!
Advertisement
Ads by CJ

ఖరీదైన కార్లలో తిరగాలని, రోడ్లపై జామ్‌జామ్‌ అంటూ షికారు కొట్టాలని ఎవరికైనా ఉంటుంది. ఇలాంటి కోరికే హీరోయిన్‌ శృతిహాసన్‌కు కూడా ఉంది. అందుకోసం ఆమె ఖరీదైన రేంజ్‌ రోవర్‌ కారు కొనుక్కుంది. అందులో హైస్పీడ్‌తో చక్కర్లు కట్టాలనేది శృతి డ్రీమ్‌. అయితే ఆమె దీన్ని కేవలం తన సొంత డబ్బులతోనే కొనుక్కొని, తనకు తాను గిఫ్ట్‌గా ఇచ్చుకొంది. బాలీవుడ్‌లో ఆమె నటించిన ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ హిట్టవ్వడంతో ఆ రెమ్యూనరేషన్‌కు మరికొంత తాను దాచుకొన్న డబ్బులను కలిపి ఆమె ఈ కోరిక తీర్చుకొంది. గతేడాది ఆమె ముంబైలోని ఓ ఫ్లాట్‌ను కొనుక్కుని ఓ ఇంటిదైంది. ఇలా సొంత ఇంటి కలతో పాటు సొంత కారు కలను కూడా ఆమె నెరవేర్చుకొని ఆ ఆనందంలో కేరింతలు కొడుతోంది.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ