Advertisementt

ఛార్మి న‌డుము కామెంట్స్‌పై చ‌ర్చ‌

Fri 05th Jun 2015 06:47 AM
charmee,puri jaganath,jyothylaxmi audio,charmee open speech,jyothylaxmi movie   ఛార్మి న‌డుము కామెంట్స్‌పై చ‌ర్చ‌
ఛార్మి న‌డుము కామెంట్స్‌పై చ‌ర్చ‌
Advertisement
Ads by CJ
బోల్డ్‌గా న‌టించ‌డమే కాదు... న‌లుగురిలో బోల్డ్‌గా మాట్లాడ‌టం కూడా తెలుస‌ని నిరూపించింది ఛార్మి. `జ్యోతిల‌క్ష్మి` ఆడియో వేడుక‌లో ఆమె చేసిన  కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. `పూరి నా న‌డుము భాగాన్ని ఇష్ట‌ప‌డుతుంటార‌నీ, ఆ విష‌యం గురించి  కాంప్లిమెంట్స్  కూడా ఇస్తుంటార‌`ని నిన్న జరిగిన ఆడియో వేడుక‌లో వ్యాఖ్యానించింది  ఛార్మి. యాంకర్ అడిగిన ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఆమె ఈ వ్యాఖ్య‌లు చేసింది. వేడుక‌లో  ఆ మాట‌ల్ని విన్న‌వాళ్లంతా షాక్‌కి గుర‌య్యారు. పూరి కూడా కాసేపు సిగ్గుప‌డిపోయారు. ఎంత బోల్డ్‌గా మాట్లాడే అల‌వాటున్నా మ‌రీ ప‌బ్లిక్ ఫంక్ష‌న్‌లో ఛార్మి అలా మాట్లాడేసిందేంటి అని చ‌ర్చించుకొంటున్నారు. ఛార్మి అచ్చ‌మైన తెలుగమ్మాయిలా చీర‌క‌ట్టుకొని వ‌చ్చింది కానీ... ఆమె మాత్రం వేడుక‌లో ర‌చ్చ ర‌చ్చ చేసింది.  డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టింది. మొత్తంగా నిన్న జ‌రిగిన పాట‌ల  వేడుక‌లో టీమ్  ఉత్సాహం చూస్తుంటే... `జ్యోతిల‌క్ష్మి`  సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ