Advertisement

సినీజోష్‌ రివ్యూ: అసుర

Fri 05th Jun 2015 06:40 AM
telugu movie asura,asura movie review,nara rohith in asura,sai karthik,krishna vijay,priya benerjee  సినీజోష్‌ రివ్యూ: అసుర
సినీజోష్‌ రివ్యూ: అసుర
Advertisement

దేవాస్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, కుషాల్‌ సినిమా,

అరన్‌ మీడియా వర్క్స్‌

అసుర

నటీనటులు: నారా రోహిత్‌, ప్రియా బెనర్జీ, రవివర్మ,

మధు సింగంపల్లి, సత్యదేవ్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌

సంగీతం: సాయికార్తీక్‌

ఎడిటింగ్‌: ధర్మేంద్ర కాకరాల

సమర్పణ: నారా రోహిత్‌

నిర్మాతలు: శ్యామ్‌ దేవభక్తుని, కృష్ణవిజయ్‌

రచన, దర్శకత్వం: కృష్ణ విజయ్‌

విడుదల తేదీ: 05.06.2015

‘బాణం’ చిత్రంతో హీరోగా పరిచయమైన నారా రోహిత్‌ ఆ సినిమా నుంచి ‘రౌడీ ఫెలో’ వరకు చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ ప్రతి సినిమా డిఫరెంట్‌గా వుండాలన్న ఉద్దేశంతో కొత్త కాన్సెప్ట్స్‌తో సినిమా చేస్తున్నాడు. అలా చేసిన మరో సినిమా ‘అసుర’. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్ర నిర్మాణంలో తను కూడా పాలు పంచుకున్నాడు నారా రోహిత్‌. ఈ చిత్రం ద్వారా కృష్ణవిజయ్‌ దర్శకుడుగా పరిచయమయ్యాడు. కమర్షియల్‌ హీరోగా సరైన హిట్‌ లేని నారా రోహిత్‌కి డిఫరెంట్‌ చిత్రాల కథానాయకుడిగా మాత్రం పేరు వుంది. మళ్ళీ ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ‘అసుర’గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్‌కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిచ్చింది? ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన కృష్ణవిజయ్‌.. నారా రోహిత్‌ని కొత్తగా చూపించడంలో ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? అనేది తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం. 

కథ: అతని పేరు ధర్మతేజ(నారా రోహిత్‌). జైలర్‌గా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో పనిచేస్తున్నాడు. యూనిఫామ్‌ వేసుకున్న రాక్షసుడుగా డిపార్ట్‌మెంట్‌లో అతనికి పేరుంది. తన దృష్టికి వచ్చిన ఏ అన్యాయాన్ని అయినా ధర్మం వైపు నడిపించాలని, దాని కోసం రాక్షసుడుగా మారినా తప్పులేదన్నది ధర్మ సిద్ధాంతం. అలాంటి ఆఫీసర్‌కి ఒకడు సమస్యగా మారాడు. అతనే చంద్రశేఖర్‌ అలియాస్‌ చార్లి(రవివర్మ). తన తండ్రి రెండో భార్య కుటుంబం ఆస్తిలో వాటా కోసం కోర్టుకెక్కడంతో తట్టుకోలేని చార్లి తల్లిని తప్ప కుటుంబంలోని అందర్నీ చంపేస్తాడు. దాంతో కోర్టు అతనికి ఉరి శిక్ష విధిస్తుంది. క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి పంపిన అభ్యర్థన తిరస్కరిస్తారు. దీంతో అతనికి ఉరి ఖరారు అవుతుంది. ప్రాణాలు తీసిన నీకు బ్రతికే హక్కు లేదని ధర్మ అన్న మాటలకు చార్లి ఓ నవ్వు నవ్వి నన్ను ఎవరూ చంపలేరు, నేను చావను అంటాడు. చార్లికి సెక్యూరిటీ కట్టుదిట్టం చేస్తాడు ధర్మ. ఎట్టి పరిస్థితుల్లో అతను ఉరి శిక్ష నుంచి తప్పించుకోలేడనుకుంటాడు. తన ప్రాణం కన్నా ఏదీ ముఖ్యం కాదని భావించే ఛార్లి అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న పాండు అనే ఖైదీకి తన ఇన్‌ఫ్లుయెన్స్‌తో బెయిల్‌ ఇప్పిస్తాడు. ‘జైలు నుంచి బయటకు వెళ్ళి నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు నేను చనిపోకూడదు’ అని పాండుకు 50 కోట్ల విలువైన వజ్రాలు ఇస్తానని చెప్తాడు. బయటకు వెళ్ళిన పాండు.. ముత్యం అనే రౌడీని కలిసి విషయం అంతా చెప్తాడు. శిక్ష నుంచి తప్పించుకోవడానికి చార్లి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? పాండు, ముత్యం చార్లికి ఏవిధంగా సాయపడ్డారు? జైలర్‌ ధర్మ ఆ ఉరిశిక్షను అమలు చేయగలిగాడా? అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: న్యాయాన్ని గెలిపించడం కోసం రాక్షసుడుగా మారడానికైనా సిద్ధపడే ధర్మతేజ క్యారెక్టర్‌లో నారా రోహిత్‌ బాగానే చేశాడు. అయితే అతను పోలీసు రూపంలో వున్న రాక్షసుడు అని సరిగ్గా ఎస్టాబ్లిష్‌ చెయ్యలేకపోవడం వల్ల సినిమా చూస్తున్నా అసుర అంటే అతను కాదేమో అనే డౌట్‌ వస్తుంది. అయితే వున్నంతలో తన క్యారెక్టర్‌కి న్యాయం చేశాడు. కొన్ని సీన్స్‌లో అతను చెప్పిన డైలాగ్స్‌ బాగున్నాయి. హీరోయిన్‌ ప్రియా బెనర్జీ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బాగుంది. ఆకట్టుకునే అందం, అభినయం లేకపోయినా తన క్యారెక్టర్‌కి వున్న పరిధి మేరకు ఓకే అనిపించింది. ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పాటల్లో పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. చార్లిగా నటించిన రవివర్మకు ఇలాంటి క్యారెక్టర్‌ చెయ్యడం కొత్తేం కాదు. అయినా అతని క్యారెక్టర్‌ నుంచి ఆడియన్స్‌ మరింత పెర్‌ఫార్మెన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. కానీ, అతన్ని ఎక్కువగా వాడుకోలేదనిపిస్తుంది. ముత్యంగా నటించిన మధు సింగంపల్లి తన క్యారెక్టర్‌కి న్యాయం చేశాడు. మిగతా క్యారెక్టర్లలో చెప్పుకోదగిన వారు ఎవరూ లేరు. 

టెక్నీషియన్స్‌: ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది సాయి కార్తీక్‌ గురించి. పాటల్లోగానీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లోగానీ హండ్రెడ్‌ పర్సెంట్‌ ఎఫర్ట్‌ పెట్టి వర్క్‌ చేసినట్టు ఔట్‌పుట్‌ చూస్తే తెలుస్తుంది. సినిమాలో వున్న పాటలు తక్కువే అయినప్పటికీ ఆడియో పరంగా బాగానే వున్నాయి. విజువల్‌గా కూడా బాగానే తీశారు. సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచి ఎండిరగ్‌ వరకు సినిమాకి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరే ప్రాణం అని చెప్పాలి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అనేది సరిగ్గా లేకపోతే సినిమాలోని ఏ సీన్‌ కూడా పర్‌ఫెక్ట్‌గా ఎలివేట్‌ అయ్యే అవకాశం వుండేది కాదు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్‌ విశ్వేశ్వర్‌ గురించి. మంచి లైటింగ్‌తో పర్‌ఫెక్ట్‌గా అన్ని సీన్స్‌ని తీశాడు. ముఖ్యంగా టైటిల్‌ సాంగ్‌ చాలా లావిష్‌గా కనిపించడంలో సినిమాటోగ్రాఫర్‌ చాలా కష్టపడ్డాడు. మిగతా టెక్నీషియన్స్‌లో ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్‌ బాగానే వుంది. ఇక డైరెక్టర్‌ విషయానికి వస్తే తను అనుకున్న కథను సినిమాటిక్‌గా చెయ్యడంలో సక్సెస్‌ అవ్వలేదని చెప్పాలి. స్టార్టింగ్‌ టు ఎండిరగ్‌ నేరేషన్‌ స్లోగా వుండడమే కాకుండా హీరో పాస్‌ అయ్యే చాలా సీన్స్‌ స్లో మోషన్‌లో చూపించడం వల్ల హీరోయిజం అనేది ఎక్కడా ఎస్టాబ్లిష్‌ అవ్వలేదు. ప్రతి సీన్‌లో నారా రోహిత్‌ కనిపించడం కూడా ఆడియన్స్‌కి బోర్‌ కొట్టిస్తుంది. స్లో నేరేషన్‌ వల్లే ఫస్ట్‌ హాఫ్‌ చాలా ఎక్కువ సేపు వున్నట్టనిపించింది. కథను సీరియస్‌గా ముందుకు నడిరచాలన్న తాపత్రయంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది మర్చిపోయాడు కృష్ణవిజయ్‌. ఫ్లో మిస్‌ అవుతుందన్న ఉద్దేశంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ని పక్కన పెట్టి వుండొచ్చు. అయితే అదే సినిమాకి మైనస్‌ అయింది. కథలోకి వెళ్ళి ఆడియన్‌కి రిలీఫ్‌ అనేది లేకపోతే అది ఎంత గొప్ప కథ అయినా బోర్‌ కొడుతుంది. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. తను అనుకున్న కథలో చాలా లూప్‌ హోల్స్‌ వుండడమే కాకుండా కొన్ని సీరియస్‌ సీన్లు కూడా నవ్వు తెప్పించేవిగా వున్నాయంటే డైరెక్టర్‌ ఎంచుకున్న కాన్సెప్ట్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

ప్లస్‌ పాయింట్స్‌:

పాటలు

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌

ఫోటోగ్రఫీ

మైనస్‌ పాయింట్స్‌:

ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అవడం

స్లో నేరేషన్‌

బోరింగ్‌ సీన్స్‌

విశ్లేషణ: ఫస్ట్‌ హాఫ్‌లో హీరో ఇంట్రడక్షన్‌, అతని క్యారెక్టరైజేషన్‌ కాస్త ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తాయి. పోలీస్‌ ఆఫీసర్స్‌లో డిఫరెంట్‌ యాటిట్యూడ్‌ వున్న పోలీస్‌ ఆఫీసర్స్‌ని మనం ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసేశాం. అయితే ఇందులో మరి కాస్త డిఫరెంట్‌ చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. చార్లి క్యారెక్టర్‌ ఎంటర్‌ అయిన తర్వాత స్టోరీ గ్రాఫ్‌ పెరుగుతూ వెళ్తుంది. ఫస్ట్‌ హాఫ్‌ ఎండిరగ్‌లో చార్లిని ఉరి తీయడంతో సెకండాఫ్‌లో ఏం జరగబోతుందోనన్న క్యూరియాసిటీ ఆడియన్స్‌ కలుగుతుంది. అయితే ఫస్ట్‌ హాఫ్‌లో జరిగిన తప్పునే మళ్ళీ మళ్ళీ చూపించడం ద్వారా స్టోరీ మీద ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్‌ పోతుంది. దర్శకుడికి ఫస్ట్‌ హాఫ్‌ మీద వున్న గ్రిప్‌ సెకండాఫ్‌లో లేదని చెప్పాలి. సెకండాఫ్‌ని ఏదో విధంగా క్లైమాక్స్‌కి తీసుకురావాలన్న ప్రయత్నమే కనిపిస్తుంది తప్ప ఇంట్రెస్టింగ్‌గా అనిపించే ఒక్క సీన్‌ కూడా మనకు కనిపించదు. కొన్ని సీన్స్‌ మనం అనుకున్నట్టుగానే జరుగుతుంటాయి. చార్లిని ఉరి నుంచి తప్పించడానికి ధర్మ గర్ల్‌ ఫ్రెండ్‌ హారికను, తలారి తల్లిని, లాయర్‌ కూతుర్ని కిడ్నాప్‌ అయినా వారి గురించి కొన్ని రోజులపాటు ఎవరూ పట్టించుకోరు. ఇలాంటివి సినిమాలో ఇంకా చాలా వున్నాయి. ఇప్పటివరకు కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాలు చేస్తూ వస్తున్న నారా రోహిత్‌కి ఇది కూడా అలాంటి సినిమాయే అవుతుంది. స్లో నేరేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకపోవడం, క్యారెక్టర్లు కూడా తక్కువ కనిపించడం, సినిమా అంతా నారా రోహిత్‌నే చూడాల్సి రావడం వంటి వాటివల్ల కమర్షియల్‌గా ఈ సినిమా సక్సెస్‌ అయ్యే అవకాశాలు తక్కువ. సీరియస్‌గా రన్‌ అయ్యే కథ కోసం రెండున్నర గంటలు థియేటర్‌లో కూర్చొని చూసే ఓపిక ఇప్పటి ఆడియన్స్‌కి లేదన్నది నిజం. ‘అసుర’ కూడా అలాంటి సినిమాగానే మిగిలిపోతుంది.

ఫినిషింగ్‌ టచ్‌: టి.వి. సీరియల్‌కి ఎక్కువ, సినిమాకి తక్కువ

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

- హరా జి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement