Advertisement

ఫేస్‌బుక్‌తో చిక్కుల్లో పడ్డ అమితాబ్‌..!!

Sat 30th May 2015 06:03 AM
amithabacchan,face book,poem,court case  ఫేస్‌బుక్‌తో చిక్కుల్లో పడ్డ అమితాబ్‌..!!
ఫేస్‌బుక్‌తో చిక్కుల్లో పడ్డ అమితాబ్‌..!!
Advertisement

సోషల్‌ మీడియాలో అమితాబ్‌ బచ్చన్‌ చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను ట్విట్టర్‌ లేదా ఫేస్‌బుక్‌ ద్వారా ఆయన తన అభిమానులతో పంచుకుంటాడు. అంతేకాకుండా తనకు అభిమానులనుంచి వచ్చిన ఫొటోలను, ఇతర విషయాలను కూడా షేర్‌ చేస్తుంటాడు. ఇప్పుడు ఇదే అలవాటు ఆయన్ను చిక్కులో పడేసింది.

వికాస్‌ దూబే అనే వ్యక్తి పోస్టు చేసిన 'కోర్టు మే కుత్తా'  అనే పద్యం అమితాబ్‌కు బాగా నచ్చడంతో ఆయన తన అభిమానులతో ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసుకున్నాడు. ఏకంగా 1.72 లక్షల మంది దాన్ని లైక్‌ చేయగా 16 వేల మంది షేర్‌ చేశారు. అయితే వాస్తవానికి ఈ కవితను రాసింది వికాస్‌ దూబే కాదట. మహర్షి దయానంద్‌ యూనివర్సిటీలోని యువజనవ్యవహారాల శాఖ డైరెక్టర్‌ జగబీర్‌ రాథీ. ఇదే విషయాన్ని జగబీర్‌ అమితాబ్‌ టైమ్‌లైన్‌లో పేర్కొన్నాడు. తనకు దక్కాల్సిన క్రేడిట్‌ను మరెవరికో ఇచ్చారంటూ కామెంట్‌ను పోస్టు చేశాడు. అయితే జరిగిన పొరపాటును ఒప్పుకోకుండా అమితాబ్‌ ఏకంగా ఆ పోస్టును తన ఎకౌంట్‌లో కనిపించకుండా డిలీట్‌ చేశాడు. దీంతో సోషల్‌ మీడియాలో కాపీరైట్‌ చట్టాన్ని అమితాబ్‌ ఉల్లంఘించారంటూ జగబీర్‌ రూ. కోటి పరిహారం చెల్లించాలని దావా వేశాడు. ఈ మేరకు అమితాబ్‌కు నోటీసులు కూడా పంపించినట్లు సమాచారం.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement