Advertisementt

మరో ప్రతిష్టాత్మక చిత్రంలో క్వీన్‌..!!

Sat 30th May 2015 05:59 AM
kangana raunath,queen,rangoon,vishalbhardwaj  మరో ప్రతిష్టాత్మక చిత్రంలో క్వీన్‌..!!
మరో ప్రతిష్టాత్మక చిత్రంలో క్వీన్‌..!!
Advertisement
Ads by CJ

'క్వీన్‌' సినిమాలో తన అభినయంతో బాలీవుడ్‌ రారాణి అనిపించుకున్న కంగనా రౌనత్‌ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగం కానున్నారు. రెండో ప్రపంచ యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాలో కంగనా రౌనత్‌ హీరోయిన్‌గా నటించడానికి పచ్చజెండా ఊపారు.

ఇటీవలే విడుదలైన 'హైదర్‌' సినిమా కమర్షియల్‌గా హిట్‌ కావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. కొన్నాళ్లుగా హిట్‌ కోసం పరితపించిపోతున్న షాహిద్‌కపూర్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో చారిత్రాత్మక కథాంశంతో 'రంగూన్‌' సినిమా తెరకెక్కనుంది. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్‌ నేతృత్వంలోని భారతీయ సైనికులకు, సుభాష్‌ చంద్రబోస్‌ నేతృత్వంలోని ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీకి జరిగిన యుద్ధం ఆధారంగా ఈ సినిమాను తెరకిక్కించనున్నారు. ఈ సినిమాలో షాహిద్‌కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌లు హీరోలుగా నటిసున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఇప్పుడు కంగనా రౌనత్‌ కూడా నటించనున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ