Advertisementt

‘బాహుబలి’ టీమ్‌ ఆశలు మరింత పెరిగాయి!

Wed 27th May 2015 03:21 AM
bahubali movie,rajamouli,peekay movie,aamir khan,china   ‘బాహుబలి’ టీమ్‌ ఆశలు మరింత పెరిగాయి!
‘బాహుబలి’ టీమ్‌ ఆశలు మరింత పెరిగాయి!
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొంందుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి.. ది బిగినింగ్‌’ (పార్ట్‌ 1) ఆడియో వేడుకను మే 31న జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఆడియో వేడుకకు హైదరాబాద్‌ హైటెక్స్‌ ఓపెన్‌ గ్రౌండ్స్‌ వేదిక కానుంది. కాగా ఈ వేడుకకు ‘ఈగ’ హీరో నాని యాంకరింగ్‌ చేయనున్నాడు. మరి లేడీ యాంకర్‌గా ఎవరు ఉంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ‘బాహుబలి’ని చైనీస్‌ భాషలో కూడా విడుదలచేయాలని ఆలోచిస్తున్న ‘బాహుబలి’ యూనిట్‌కు తాజాగా జరిగిన ఓ సంఘటన మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది.
బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్‌ హీరోగా రాజ్‌కుమార్‌ హిరాని దర్శకత్వంలో రూపొందిన ‘పీకే’ చిత్రం చైనీస్‌ భాషలోకి అనువాదమైంది. గత శుక్రవారం చైనాలో మొత్తం 4,600 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అక్కడ మన కరెన్సీ లెక్కల ప్రకారం 178.34కోట్లను వసూలు చేసింది. ఒక భారతీయ చిత్రం చైనాలో ఈ రేంజ్‌లో వసూళ్లు సాధించడం ఇదే ప్రధమం. గతంలో అమీర్‌ఖాన్‌ ‘3ఇడియట్స్‌’ కూడా చైనాలో మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యాన్ని గమనించిన ‘బాహుబలి’ చిత్ర యూనిట్‌ చైనాలో కూడా విడుదల చేస్తుండటంతో ‘పీకే’ సాధించిన వసూళ్లను చూసి తమ చిత్రం కూడా అక్కడ అదే స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతుందనే ఆశాభావంతో ఉన్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ