Advertisementt

అఖిల్ సినిమా పేరు `మిస్సైల్` కాద‌ట‌!

Wed 27th May 2015 03:22 AM
akhil debut movie,misile,akkineni akhil,v.v.vinayak,nagarjuna,nithin,vinayak,  అఖిల్ సినిమా పేరు `మిస్సైల్` కాద‌ట‌!
అఖిల్ సినిమా పేరు `మిస్సైల్` కాద‌ట‌!
Advertisement
Ads by CJ
అక్కినేని కుటుంబం నుంచి మ‌రో వార‌సుడు క‌థానాయ‌కుడిగా  ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఆయనే అఖిల్‌. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ తెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. యువ క‌థానాయ‌కుడు నితిన్ నిర్మిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఆ చిత్రానికి `మిస్సైల్‌` అనే పేరు ప్ర‌చారంలో ఉంది. అక్కినేని అభిమానులంతా `మిస్సైల్‌` పేరునే స్ప్రెడ్ చేస్తున్నారు. దీంతో నితిన్ రంగంలోకి దిగి పేరుపై క్లారిటీ ఇచ్చాడు. అఖిల్ సినిమాకి ఇంకా పేరు నిర్ణ‌యించ‌లేద‌ని ట్వీట్ చేశారు. ప్ర‌చారంలో ఉన్న `మిస్సైల్‌` క‌రెక్టు కాద‌ని చెప్పుకొచ్చారు. ఇటీవ‌లే స్పెయిన్‌లో నెల రోజుల‌పాటు చిత్రీక‌ర‌ణ జ‌రిపారు. అక్క‌డ అఖిల్‌పై పాట‌లు, ఫైట్లు తెర‌కెక్కించారు. త‌దుప‌రి కెన‌డాలో మ‌రో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌ర‌ప‌బోతున్నారు. ఇందులో అఖిల్ స‌ర‌స‌న సాయేషా సైగ‌ల్ న‌టిస్తోంది. 
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ