Advertisementt

'అసుర' రిలీజ్ వాయిదా..!

Mon 25th May 2015 11:51 PM
nara rohit,asura movie,june 5th release,pandaga chesko,rakshasudu  'అసుర' రిలీజ్ వాయిదా..!
'అసుర' రిలీజ్ వాయిదా..!
Advertisement
Ads by CJ

హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు హీరో నారా రోహిత్. 'రౌడీఫెలో' చిత్రం తరువాత కృష్ణ విజయ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న మరో సినిమా 'అసుర'. ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రబృందం వెల్లడించారు.

అయితే అదే రోజున రామ్ నటించిన 'పండగ చేస్కో', సూర్య నటించిన 'రాక్షసుడు' చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. 'అసుర' ట్రైలర్స్ కి, సాంగ్స్ కి ప్రేక్షకుల నుండి మంచి వస్తోంది. 'పండగ చేస్కో' చిత్రం కన్నా ప్రేక్షకులకు 'అసుర' పైనే అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఆ చిత్రాలతో పోటీ ఎందుకులే అనుకున్నాడో ఏమో..? కాని రోహిత్ కాస్త వెనక్కి తగ్గాడు. జూన్ 5 న సినిమాను రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నాడు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ