Advertisementt

ఆ సినిమా సీక్వెల్‌పై చిరు మోజు!

Thu 14th May 2015 09:38 PM
chiranjeevi,k raghavendra rao,jagadeka veerudu athiloka sundari,sequel  ఆ సినిమా సీక్వెల్‌పై చిరు మోజు!
ఆ సినిమా సీక్వెల్‌పై చిరు మోజు!
Advertisement

మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్‌ల కాంబినేషన్‌లో వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. ఈ చిత్రంలో శ్రీదేవి అతిలోకసుందరిగా నటించింది. ఇటీవలే ఈ చిత్రం 25ఏళ్లను పూర్తి చేసుకుంది. చిరు ఇంటిలో ఈ చిత్రానికి సంబంధించిన వేడుక కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఈ చిత్రానికి సీక్వెల్‌ చేస్తే బాగుంటుందనే ఆలోచనను చిరు మరోసారి బయటపెట్టాడని సమాచారం. నిర్మాత అశ్వనీదత్‌ కూడా ఆ అవకాశం కూడా నాకే అప్పగించండి అని ఓ కర్చీఫ్‌ వేశాడట. రాఘవేంద్రరావు మాత్రం తను రిటైర్‌మెంట్‌ స్టేజీలో ఉన్నానని, కాబట్టి ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలు తనకు కాకుండా మరో యువ దర్శకుడికి అప్పగిస్తే బాగుంటుందనే సలహా ఇచ్చాడట. సలహా చెప్పడమే కాదు... తన శిష్యుడు రాజమౌళి పేరును సూచించాడట. మరి రామ్‌చరణ్‌,అశ్వనీదత్‌, రాజమౌళి కాంబినేషన్‌ అంటే అదిరిపోవడం ఖాయం అంటున్నారు. ఇంతకీ అతిలోకసుందరిగా ఎవరినీ ఎంచుకోవాలి? అనే  అనుమానం మాత్రం అందరినీ వెంటాడుతోంది....!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement