Advertisementt

'బాహుబలి' ఆడియో రిలీజ్‌ కు డేట్ ఫిక్స్‌!

Thu 14th May 2015 09:40 PM
bahubali,ss rajamouli,keeravani,bahubali audio release details  'బాహుబలి' ఆడియో రిలీజ్‌ కు డేట్ ఫిక్స్‌!
'బాహుబలి' ఆడియో రిలీజ్‌ కు డేట్ ఫిక్స్‌!
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, అనుష్క.. వంటి భారీ తారాగణంతో తెలుగులోనే తొలిసారిగా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రం పోస్టర్స్‌ను వరుసగా విడుదల చేస్తున్న జక్కన్న ఈ చిత్రంపై అంచనాలను విపరీతంగా పెంచేస్తున్నాడు. కాగా ఈ చిత్రం తొలి ట్రైలర్‌ మే 31న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. కాగా అదే రోజు ఈ చిత్రం ఆడియో వేడుకను కూడా భారీ స్థాయిలో జరిపేందుకు రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నాడు. కీరవాణి అందించిన పాటల ట్యూన్స్‌ అత్యద్భుతంగా ఉన్నాయని, అలాగే ఆర్‌.ఆర్‌. కూడా అదిరిపోయే లెవల్లో కీరవాణి అద్భుతాలు సృష్టించడానికి రెడీ అవుతున్నాడని యూనిట్‌వర్గాలు ఎంతో నమ్మకంతో చెబుతున్నాయి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ