వర్మ స్కెచ్‌ పనిచేయడంలేదు!

Tue 12th May 2015 11:51 AM
ram gopal varma,365 days movie,varma strategy,varma marriage secrets  వర్మ స్కెచ్‌ పనిచేయడంలేదు!
వర్మ స్కెచ్‌ పనిచేయడంలేదు!
Sponsored links

తన సినిమాను మార్కెటింగ్‌ చేసుకోవడానికి వర్మ వేసే ఎత్తులు ప్రేక్షకులకే కాదు... ట్రేడ్‌వర్గాలకు కూడా బాగా అవగతమవుతున్నాయి. దాంతో ఆయన రీసెంట్‌గా తన చిత్రం ప్రమోషన్‌ కోసం మాట్లాడే మాటలని ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. దాంతో ఆ మాటలతోనే సినిమాని అమ్మేయాలన్న ఆయన ఆలోచనలు సైతం ఫలించలేదు. తాజాగా నిజజీవితంలో తన వివాహం ఎందుకు విఫలమైందో కారణాలు తన కొత్త చిత్రం ‘365డేస్‌’లో ఉంటాయని ఆయన పదేపదే మీడియాకు, ఇంటర్వ్యూలలో చెబుతున్నాడు. దాంతో ఆ విషయం ఏమిటా? అని తెలుసుకోవడానికి ఎగబడి తన చిత్రానికి బిజినెస్‌ అవుతుందని ఆయన భావించినట్లు సమాచారం. అయితే ఈ కొత్త స్ట్రాటర్జీ ఏమాత్రం ఫలించకపోవడంతో తన సినిమా విడుదలను వాయిదా వేసుకున్నాడు. మరి మే 22న ఈ చిత్రం రిలీజ్‌ చేస్తానంటున్నాడు. మరి అప్పటికైనా  బిజినెస్‌ జరుగుతుందో లేదో చూడాల్సివుంది...!

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019