ఇటీవలే ‘పటాస్’ చిత్రంతో పెద్ద విజయాన్ని అందుకొన్న నందమూరి యంగ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌తో దిల్‌రాజు ఓ చిత్రాన్ని ప్లాన్‌చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ‘పిల్లా... నువ్వులేని జీవితం’ దర్శకుడు ఎ.యస్.రవికుమార్‌చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు, అయితే ఈ చిత్రం విషయంలో నందమూరి అభిమానులకు కొన్ని భయాలు నెలకొని ఉన్నాయి. ఇదే దర్శకుడు తన కెరీర్ ప్రారంభంలో బాలకృష్ణ డేట్స్ సంపాదించి ‘వీరభద్ర’ అనే డిజాస్టర్ సినిమా తీశాడు. ‘యజ్ఞం’తో తనకొచ్చిన మంచి పేరును ఇలా చెరిపేసుకొన్న చౌదరి ఆ తర్వాత అసలు అవకాశాలే రాక నానా ఇబ్బంది పడ్డాడు. మరలా ఇటీవలే ‘పిల్లా..నువ్వులేని జీవితం’తో కాస్త ఊరటపొందాడు. మరి నందమూరి మరో హీరో కళ్యాణ్‌రామ్‌తో ఆయన ఎలాంటి చిత్రం చేస్తోడో వేచిచూడాల్సివుంది....!