Advertisement

అల్లరోడికి లగ్నం కుదిరింది..!

Thu 30th Apr 2015 11:52 AM
allari naresh,engagement,virupa,james bond movie  అల్లరోడికి లగ్నం కుదిరింది..!
అల్లరోడికి లగ్నం కుదిరింది..!
Advertisement

కామెడీ స్టార్ అల్లరి నరేష్ కు పెళ్లి చేయాలని రెండు సంవత్సరాలుగా వారి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈ అల్లరోడికి పెళ్లి కుదిరిందని సమాచారం. చెన్నై లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న విరూప అనే యువతిని పెళ్లాడనున్నాడట. మొదట నుండి సంప్రదాయబద్దకంగా ఉండే అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటున్న నరేష్ కు అలాంటి అమ్మాయే దొరకడంతో వెంటనే ముహూర్తాలు కూడా పెట్టేసారట. మే3 వ తారీఖు నిశ్చితార్ధం జరుపుకొని ఈ సంవత్సంలోపే పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం నరేష్ ఏ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై వస్తున్న 'జేమ్స్ బాండ్' చిత్రంలో నటిస్తున్నాడు. ఇది ఆయన కెరీర్ లో 49 వ సినిమా. ఈ ఏడాదిలోపే 50 వ సినిమాలో నటించి ఆ తరువాత పెళ్లిపీటలు ఎక్కనున్నాడని సమాచారం.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement