చిలిపికృష్ణుడిగా మహేష్‌!

Tue 28th Apr 2015 11:47 AM
mahesh babu,srimanthudu movie,shruthi haasan,koratala siva  చిలిపికృష్ణుడిగా మహేష్‌!
చిలిపికృష్ణుడిగా మహేష్‌!
Advertisement

మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ (వర్కింగ్‌టైటిల్‌) ముస్తాబవుతున్నాడు. ఈ సినిమా గురించి వివరాలను చిత్రబృందం గోప్యంగా ఉంచుతోంది. అయితే ‘శ్రీమంతుడు’కి సంబంధించిన ఓ విషయం బయటకు వచ్చింది. ఇదో ఫ్యామిలీ డ్రామా అని ముందు నుంచి తెలుస్తున్న అంశం. అయితే ఇందులో లవ్‌ ట్రాక్‌ అదిరిపోతుందని అంటున్నారు. మహేష్‌బాబు, శృతిహాసన్‌ల మధ్య సాగే లవ్వాట సూపర్బ్‌గా వచ్చిందట. ఈ ట్రాక్‌ ఎంతో కొత్తగా ఉండడమే కాదు... మహేష్‌ చిలిపిదనాన్ని ఓ కొత్తకోణంలో చూపించబోతోందని తెలుస్తోంది. మహేష్‌ ఇప్పటివరకు ప్యూర్‌లవ్‌స్టోరీలు సరిగ్గా చేయలేదు. చేసినా అవి ఆడలేదు. ఈ సినిమా ఆ లోటును కొంతమేర పూరిస్తుందని మహేష్‌-శృతిల లవ్‌ట్రాక్‌ యూత్‌కు పిచ్చపిచ్చగా నచ్చేలా కొరటాల శివ తీర్చిదిద్దాడని సమాచారం. 


Loading..
Loading..
Loading..
advertisement