పిలవని పేరంటానికి మంచు లక్ష్మి గుడ్ బై..?!

Sat 25th Apr 2015 10:22 PM
pilavani perantam,manchu lakshmi prasanna,dhana raj,poorna,varun sandesh  పిలవని పేరంటానికి మంచు లక్ష్మి గుడ్ బై..?!
పిలవని పేరంటానికి మంచు లక్ష్మి గుడ్ బై..?!
Advertisement
Ads by CJ

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో జగన్ (నిర్దోషి) ఫేం వెంకన్న బాబు దర్శకత్వంలో గత ఏడాది నవంబర్లో 'పిలవని పేరంటం' అనే చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. ముహూర్తం రోజున ఈ చిత్రంలో నేనే హీరో అంటూ కమెడియన్ ధనరాజ్ ప్రకటించడం వివాదాస్పదం అయ్యింది. ధనరాజ్ ప్రకటన, తదనంతర పరిణామాలు మంచు లక్ష్మికి ఆగ్రహం తెప్పించాయి. దాంతో, అతన్ని చిత్రం నుండి తొలగించారు.  తాజాగా ఈ చిత్రంలో మంచు లక్ష్మి నటించడం లేదనే వార్త బయటకొచ్చింది. ఆమె స్థానంలో అవును ఫేం పూర్ణను తీసుకున్నారు. పూర్ణకు జంటగా వరుణ్ సందేశ్ నటిస్తున్నారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగిందని సమాచారం. మంచు లక్ష్మి చిత్రం నుండి తప్పుకోవడానికి గల కారణాలు తెలియలేదు.  

ఫిమేల్ ఓరియెంటెడ్ హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే ప్రధాన బలం. కథ అంతా ప్రధాన పాత్రధారి చుట్టూ తిరుగుతుంది. థియేటర్లో ప్రేక్షకులను ఉత్కంఠతకు గురి చేసే సన్నివేశాలు చిత్రంలో చాలా ఉన్నాయని చిత్ర బృందం తెలిపింది. విజయ్ కురాకుల ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ