Advertisement

14 రోజులు లేటుగా ఎన్టీఆర్ యాక్షన్..!

Sat 25th Apr 2015 03:07 PM
jr ntr,bvsn prasad,jr ntr and sukumar movie details,maa nannaku prematho  14 రోజులు లేటుగా ఎన్టీఆర్ యాక్షన్..!
14 రోజులు లేటుగా ఎన్టీఆర్ యాక్షన్..!
Advertisement

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించే సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 14 నుండి విదేశాలలో ప్రారంభమవుతుంది. లండన్‌లో లొకేషన్ల వేట పూర్తయింది. యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరణ ప్రారంభిస్తారని సమాచారం. తొలుత మే 1 నుండి రెగ్యులర్ షూటింగ్ జరపాలని సన్నాహాలు చేశారు. ఓ 14 రోజులు లేటుగా ఫస్ట్ షెడ్యూల్ మొదలవుతుంది.

 తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం నేపధ్యంలో సాగే కథకు 'మా నాన్నకు ప్రేమతో..' అనే టైటిల్ ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. చిత్ర బృందం ఇంకా దృవీకరించలేదు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. చంద్రబోస్‌ సాహిత్యం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఇమేజ్, సుకుమార్ స్టైల్ కలయికలో డిఫరెంట్‌గా ఈ చిత్రం రూపొందనుంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement