Advertisement

ప్రభాస్‌కు ‘బాహుబలి’ కష్టాలు తప్పడం లేదు!

Thu 23rd Apr 2015 03:04 AM
prabhas,rajamouli,bahubali movie,prabhas new movie  ప్రభాస్‌కు ‘బాహుబలి’ కష్టాలు తప్పడం లేదు!
ప్రభాస్‌కు ‘బాహుబలి’ కష్టాలు తప్పడం లేదు!
Advertisement

రాజమౌళి సినిమా అంటే అందమైన గులాబి పువ్వులా ఉంటుంది. చూడటానికి ఎంతో ముద్దుగా ఉండే ఈ పువ్వును తాకాలని ప్రయత్నిస్తే ముళ్లు గుచ్చుకుంటాయి. రాజమౌళి సినిమాల్లో నటించే హీరోలది కూడా అదే పరిస్థితి. రెండేళ్లుగా స్టార్‌ హీరో ప్రభాస్‌కు ‘బాహుబలి’ కష్టాలు తీరలేదు. ‘మిర్చి’ చిత్రంలో ఎంతో మేన్లీగా లవ్లీగా కనిపించి అందరినీ ఆకట్టుకున్న ప్రభాస్‌ ‘బాహుబలి’ కోసం విపరీతంగా బరువు పెరిగాడు. ఇప్పుడు ‘బాహుబలి’ షూటింగ్‌ పూర్తయినప్పటికీ తన కొత్త చిత్రాన్ని వెంటనే ప్రారంభించలేకపోతున్నాడు. ‘బాహుబలి’ కోసం పెరిగిన బరువును తగ్గించే పనిలో పడి విపరీతంగా కష్టపడుతున్నాడు. ఆయన తదుపరి చిత్రానికి ప్రభాస్‌ బరువు తగ్గి స్లిమ్‌ లుక్‌లో కనిపించాలని దర్శకుడు సుజీత్‌ ఆయన్ను కోరాడు. చేయబోయేది రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ కావడంతో స్లిమ్‌ కావడం తప్పని సరి పని అని చెప్పడంతో ‘బాహుబలి’ కోసం ఎంతగా కష్టపడి బరువు పెరిగాడో ఇప్పుడు బరువు తగ్గడానికి పదిరెట్టు కష్టపడుతున్నాడట ప్రభాస్‌. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement