హీరోగా జయసుధ తనయుడు..!

 

సహజనటి జయసుధ రెండో తనయుడ్ని హీరోగా, పెద్ద కొడుకుని విలన్‌(అతని ఇంట్రస్ట్‌)గా ఇంట్రడ్యూస్‌ చేస్తాననీ ఓ సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే. ఏ ఆర్బాటం లేకుండా శ్రేయాన్‌ కపూర్‌ హీరోగా టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. అతని సరసన హిందీలో పలు సీరియళ్లు చేసిన అనుభవం గల ప్రగతి నాయికగా నటిస్తోందని తెలిసింది. వాసు మంతెన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయనే ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విశేషాలను మీడియా ముందుంచనున్నారనీ చిత్ర వర్గాల సమాచారం. 

jayasudha son as hero
shreyan kapoor debut movie
jayasudha son news