Advertisementt

మహేష్ తోనే నటిస్తా అంటున్న స్టార్ హీరోయిన్..!

Tue 07th Apr 2015 06:36 AM
kangana ranauth,mahesh babu,queen movie,national award  మహేష్ తోనే నటిస్తా అంటున్న స్టార్ హీరోయిన్..!
మహేష్ తోనే నటిస్తా అంటున్న స్టార్ హీరోయిన్..!
Advertisement
Ads by CJ

హిమాచల్ ప్రదేశ్ లో ఓ చిన్న పట్టణం నుండి వచ్చిన బాలీవుడ్ బ్యూటీ కంగనరనౌత్ అందంలోను, నటనలోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా తను నటించిన 'క్వీన్' సినిమాకు జాతీయస్థాయిలో అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా కంగన మీడియాతో మాట్లాడుతూ 'క్వీన్' సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డు దక్కడం ఆనందంగా ఉందని, ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటానని అనుకోలేదని చెప్పారు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తానని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లోనే కాకుండా వేరే భాషలలో నటించే అవకాశాలున్నాయా అని అడిగిన ప్రశ్నకు ప్రస్తుతం హిందీలో చేయాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయని, ఇతర భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. తెలుగులో అవకాశం వస్తే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో చేస్తానంటోంది. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఏక్ నిరంజన్' చిత్రంలో కంగనా నటించిన సంగతి తెలిసిందే.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ