Advertisementt

స్టైలిష్ లుక్ లో బాలయ్య..!

Tue 07th Apr 2015 06:34 AM
balakrishna,legend,lion,audio launch,exclusive photo  స్టైలిష్ లుక్ లో బాలయ్య..!
స్టైలిష్ లుక్ లో బాలయ్య..!
Advertisement
Ads by CJ

లెజెండ్, లయన్, డిక్టేటర్ వంటి టైటిల్స్ బాలయ్యకు తప్ప మరెవరికి సూట్ కావేమో అనిపిస్తుంది. ఆయన నటించే సినిమా టైటిల్స్ లోనే మంచి పవర్ ఉంటుంది. ప్రస్తుతం సత్యదేవ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన 'లయన్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఆడియో వేడుక ఏప్రిల్ 9 న హైదరాబాద్ శిల్పకళావేదికలో వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి హాజరవనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా బాలయ్య లయన్ సినిమాలో ఎక్స్ క్లూజివ్ ఫోటోను తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా విడుదల చేసాడు. ఈ ఫోటో చూస్తుంటే లయన్ సినిమాలో కొత్త బాలయ్యను చూడబోతున్నామా అన్నట్లుగా ఉంది. బాలయ్య మునుపటి కంటే చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ‘లెజెండ్' వంటి లెజెండరీ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో నందమూరి అభిమానుల్లో ‘లయన్' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకులకు ఎంత వరకు రీచ్ అవుతుందో చూడాలి..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ