Advertisement

హాట్ కేకులా అమ్ముడైన 'బాహుబలి' బాలీవుడ్ రైట్స్!

Sat 21st Mar 2015 12:34 AM
bahubali,bollywood rights,karan johar,prabhas  హాట్ కేకులా అమ్ముడైన 'బాహుబలి' బాలీవుడ్ రైట్స్!
హాట్ కేకులా అమ్ముడైన 'బాహుబలి' బాలీవుడ్ రైట్స్!
Advertisement

టాలీవుడ్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్‌, అనుష్క, రానా, తమన్నా వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన బిజినెస్‌ను జరుపుకుంటూ రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. కాగా ఈ చిత్రం బాలీవుడ్‌లో కూడా విడుదలకానున్న సంగతితెలిసిందే. కాగా బాలీవుడ్‌ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్‌జోహార్‌ భారీ మొత్తం చెల్లించి స్వంతం చేసుకున్నట్లు సమాచారం. ఖచ్చితంగా ఎంత రేటు చెల్లించాడు? అనేది బయటకు రానప్పటికీ భారీ మొత్తాన్ని చెల్లించి రెండు భాగాలను ఒకేసారి సొంతం చేసుకున్నట్లు సమాచారం. మే 15న ఈ చిత్రం తొలి భాగం విడుదలకు సిద్దమవుతోంది. ప్రస్తుతం మొదటి భాగానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement