Advertisementt

గోమాంసమే కావాలంటున్న వెటరన్‌ హీరో..!!

Fri 20th Mar 2015 12:33 PM
rishi kapoor,twitter,ban on meat,upcoming films  గోమాంసమే కావాలంటున్న వెటరన్‌ హీరో..!!
గోమాంసమే కావాలంటున్న వెటరన్‌ హీరో..!!
Advertisement
Ads by CJ

మహారాష్ట్రలో గోమాంసం విక్రయించడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో గోమాంసం విక్రయించినా, కలిగి ఉన్నా ఐదేళ్ల జైలుశిక్ష, రూ. 50 వేల జరిమానా విధిస్తామని ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఇప్పుడు ఇదే బాటలో హర్యానా ప్రభుత్వం కూడా గోమాంసాన్ని నిషేధిస్తూ చట్టాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే దీనిపై వెటరన్‌ హీరో రిషికపూర్‌ మండిపడుతున్నాడు. తాను హిందువే అయినప్పటికీ గోమాంసం తింటానని, అలా అని తనకు భగవంతుడి భక్తి లేదని అంటారా అంటూ సోషల్‌ మీడియాలో ప్రశ్నించాడు. సాధారణంగా నటీనటులకు అన్ని వర్గాల్లో అభిమానులుంటారు. అందుకని ఇలాంటి సున్నితమైన విషయాలపై స్పందించడానికి నటీనటులు సంశయిస్తుంటారు. కాని రిషి కపూర్‌ మాత్రం అడగకముందే సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాన్ని నిర్భయంగా వెల్లడించారంటూ ప్రశంసలజల్లు కురుస్తోంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ