Advertisementt

ఈ యువహీరో ఇప్పుడు హాట్‌టాపిక్!

Thu 19th Mar 2015 04:49 AM
nikhil,swamy rara,karthikeya,surya vs surya,sankarabharanam  ఈ యువహీరో ఇప్పుడు హాట్‌టాపిక్!
ఈ యువహీరో ఇప్పుడు హాట్‌టాపిక్!
Advertisement
Ads by CJ

స్వామిరారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య.. ఇలా మూడు విభిన్న చిత్రాలతో మూడు విజయాలు దక్కించుకుని తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సృష్టించుకొని సినీ పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా నిలిచాడు హీరో నిఖిల్. అంతేకాదు సినిమా సినిమాకి అతని మార్కెట్ రేంజ్ పెరగడంతో ఈ యువహీరోకు ఆఫర్ల వెల్లువ మొదలైంది. అయితే నిఖిల్ మాత్రం ఆచితూచి అడుగేయాలని నిర్ణయించుకున్నాడు. వరుసగా మూడు విజయాలు అందించిన ప్రేక్షకులు తన నుండి ఆశించే వైవిధ్యమైన చిత్రాలు మాత్రమే చేయాలని అనుకుంటున్నాడు. త్వరలో కోనవెంకట్ నిర్మాతగా రూపొందనున్న ‘శంకరాభరణం’ చిత్రంలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఇంకా నిఖిల్ ఈ చిత్రానికి పూర్తిగా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. త్వరలోనే అమెరికాలో యాక్టింగ్ కోర్సును పూర్తిచేసి ఆ తర్వాత తన తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తానని ఈ యువ కథానాయకుడు అంటున్నాడు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ