Advertisementt

పూరీ రూట్ లోకి వచ్చిన ఛార్మి..!

Thu 12th Mar 2015 02:41 AM
charmi,poorijagannath,c.kalyan,temper,satellite rights  పూరీ రూట్ లోకి వచ్చిన ఛార్మి..!
పూరీ రూట్ లోకి వచ్చిన ఛార్మి..!
Advertisement
Ads by CJ

పూరిజగన్నాథ్-ఛార్మి-సి.కళ్యాణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'జ్యోతిలక్ష్మి'. కాగా ఈ చిత్రంతో ఛార్మి కూడా నిర్మాతగా మారనుంది. ఈ సినిమాకు సి.కళ్యాణ్ ఒక్కడే కాదు.. చాలా మంది నిర్మాతలు ఉన్నారు. ఆల్ రెడీ ఈ చిత్రానికి పూరిజగన్నాథ్ ఓ నిర్మాత అనేది తెలిసిన సంగతే. ఈ చిత్రంలో పారితోషికం బదులుగా పూరి వాటా తీసుకున్నాడు. ఇప్పుడు ఛార్మి కూడా అదే పని చేసింది. నాకు పారితోషికం వద్దు.. పదో ఇరవై పైసలో వాటా ఇవ్వమని అడిగిందట. దాంతో నిర్మాణ ఖర్చులు కూడా తగ్గుతాయి కాబట్టి సి.కళ్యాణ్ కూడా ఆమె ప్రపోజల్ కు ఓకే చెప్పేసాడు. మహా అయితే ఈ సినిమాలో నటించినందుకు ఛార్మికి 25 లేదా 30లక్షలు పారితోషికం వచ్చేది. అదే ఈ సినిమా హిట్టయితే కోట్లు వస్తాయనే ఆశతో ఆమె ఉందని సమాచారం. అందులోనూ ఇది పూరి సినిమా. నిర్మాణ ఖర్చు కూడా తక్కువే. అందులోనూ 'టెంపర్' తర్వాత పూరి చేస్తున్న సినిమా ఇది. కాబట్టి క్రేజ్ కు డోకా ఉండదు. పూరి ఎలాగోలా ఈ చిత్రానికి ఫుల్ పబ్లిసిటీ వచ్చేలా చేస్తాడు. దీంతో నిర్మాణ ఖర్చులు కూడా శాటిలైట్ రైట్స్ ద్వారానే వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక మిగిలినదంతా తమకే అనే ఉద్దేశ్యంతో ఉన్న పూరికి ఛార్మి కూడా తోడయ్యి, మంచి నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ