Advertisementt

నాగార్జున 'ఆత్మ'గా కనిపించనున్నాడా..!

Wed 11th Mar 2015 03:01 AM
nagarjuna,soggade chinni nayana,lavanya tripati,ramyakrishna  నాగార్జున 'ఆత్మ'గా కనిపించనున్నాడా..!
నాగార్జున 'ఆత్మ'గా కనిపించనున్నాడా..!
Advertisement
Ads by CJ

నాగార్జున ప్రధాన పాత్రలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కధానాయకులు. నూతన దర్శకుడు కళ్యాన్ కృష్ణ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. పల్లెటూరు నేపధ్యంలో సాగే ఈ కథలో నాగార్జున రెండు పాత్రలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 'మనం' సినిమా నుండి నాగార్జున విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. అలానే ఈ చిత్రంలో కూడా నాగార్జున ఎన్నడూ నటించని ఓ ఆత్మ రూపంలో కనిపించనున్నట్లు సమాచారం. తాత, మనువడి పాత్రలో నటించే నాగార్జున మనువడికి సలహాలు ఇవ్వడానికి ఆత్మ రూపంలో వస్తాడని ఫిలింనగర్ వర్గాలు  చెబుతున్నాయి. ఈ పాత్ర సినిమాకి హైలైట్ గా నిలుస్తుందట. మరి ఈ విషయాలు నిజమో కాదో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ