Advertisementt

హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోన్న సీరియల్ నటి..!

Tue 10th Mar 2015 12:51 PM
jadugadu,naga sowrya,sonarika,v.v.s.prasad  హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోన్న సీరియల్ నటి..!
హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోన్న సీరియల్ నటి..!
Advertisement
Ads by CJ

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో హీరోగా పరిచయమయ్యి మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు హీరో నాగ శౌర్య. ప్రస్తుతం నాగశౌర్య హీరోగా సత్య ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై వి.వి.ఎస్.ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'జాదుగాదు'. చితకాయల రవి చిత్ర దర్శకుడు యోగేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ మధ్యకాలంలో బుల్లితెర నటీమణులు సినిమాలలో లీడ్ పాత్రలలో కనిపిస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కూడా బుల్లితెర సీరియల్ నటి 'సోనారిక' ను కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. 'హర హర మహాదేవ' సీరియల్ లో పార్వతి పాత్రలో సోనారిక నటిస్తుంది. నాగ శౌర్య కు  జంటగా నటించే ఈ చిత్రంతో సోనారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించనున్నారు.  

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ