Advertisementt

శాంతించిన డిస్ట్రిబ్యూటర్లు....!

Sun 08th Mar 2015 05:59 AM
south indian super star,rajinikanth,linga movie,rakline venkatesh  శాంతించిన డిస్ట్రిబ్యూటర్లు....!
శాంతించిన డిస్ట్రిబ్యూటర్లు....!
Advertisement
Ads by CJ

 

సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌, నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘లింగ’ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ రేట్లకు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 50శాతం కూడా రికవరీ కాలేదు. దీంతో తాము నష్టాల పాలయ్యామని, తాము పోగొట్టుకున్న డబ్బుకు పరిహారం ఇప్పించమని డిస్ట్రిబ్యూటర్లు ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. మొదట్లో అసలు పరిహారం ఇచ్చే పనే లేదని మొండికేసిన నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ ఆ తర్వాత 3కోట్లు ఇస్తానన్నాడు. కానీ డిస్ట్రిబ్యూటర్లు అందుకు ససేమిరా అన్నారు. చివరకు నిర్మాత 10కోట్లు పరిహారంగా ఇవ్వడానికి సిద్దపడటంతో డిస్ట్రిబ్యూటర్లు కాస్త శాంతించినట్లు కనిపిస్తోంది. 
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ