Advertisement

టిడిపి శ్రేణులు ‘టెంపర్‌’ని పక్కన పెట్టాయా?

Sun 08th Mar 2015 12:03 PM
temper,surya vs surya,swamy rara,tdp,50 crores club  టిడిపి శ్రేణులు ‘టెంపర్‌’ని పక్కన పెట్టాయా?
టిడిపి శ్రేణులు ‘టెంపర్‌’ని పక్కన పెట్టాయా?
Advertisement

‘టెంపర్‌’ 50 కోట్లని అందుకుంటుందా?

‘నటరత్న’ ఎన్టీఆర్‌ ఫ్లాప్‌ సినిమా కలెక్షన్స్‌ ఇతర హీరోల హిట్‌ సినిమాల కలెక్షన్స్‌తో సమానంగా వుండేవి: ఇది గత చరిత్ర!

జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదలయితే తెలుగు నేల ఫ్లెక్సీలతో కళకళలాడేవి. ఎన్టీఆర్‌ గన్నవరం విమానాశ్రయంలో దిగితే విజయవాడ వరకు కార్లు బారులుతీరివుండేవి ` ఆయనని రిసీవ్‌ చేసుకోవడానికి : ఇది నిన్నటి చరిత్ర.

ఎన్టీఆర్‌ ` పూరీ జగన్నాధ్‌ ‘టెంపర్‌’ చూసిన వారంతా మెచ్చుకున్నారు. ఏభైకోట్లు దాటి వందకోట్ల వైపు ఉరుకులు పెడుతుందని ఊహించారు. కానీ ఏభై కోట్లు చేరడమే కష్టంగా కనిపిస్తోంది. కారణం ` కళ్యాణ్‌రామ్‌ ‘పటాస్‌’ కథ ‘టెంపర్‌’ కథకి దగ్గరగా వుండటమేనని కొందరు విశ్లేషిస్తున్నారు. సినిమా కథ అన్నది పాతమాట. ‘కాన్సెప్టు’ అన్నది నేటి మాట, కథ కన్నా కధనం ` మ్యూజిక్‌ ` లొకేషన్స్‌ ప్రధానం. ఈ విషయంలో ‘టెంపర్‌’ సూపర్‌. కానీ కలెక్షన్స్‌ అనుకున్నంతగా లేకపోవడానికి కారణం : యూత్‌!

ఎన్టీఆర్‌ సినిమాపట్ల మహేష్‌బాబు - చిరంజీవి / పవన్‌ కళ్యాణ్‌ / రామ్‌ చరణ్‌ / అల్లు అర్జున్‌ ఫాన్స్‌ అంతగా మనసుపెట్టరు. టిడిపి యూత్‌ ఈ మధ్య కాలంలోనే పవన్‌కళ్యాణ్‌పట్ల ఆదరణ చూపుతున్నారు. టిడిపి యూత్‌, బాలయ్య ఫాన్స్‌ ఎన్టీఆర్‌ సినిమాలకి దూరంగా వుంటున్నారు. దీని ప్రభావం ‘టెంపర్‌’ కలెక్షన్స్‌పై పడిరది.

ఎన్టీఆర్‌ వెంటనే నష్ట నివారణకు దిగాలి. లేకుంటే 100 కోట్ల క్లబ్‌ కలలకే పరిమితమవుతుంది.

ఇదే సమయంలో నిఖిల్‌ ‘సూర్య వర్సెస్‌ సూర్య’ సినిమా గురించి ముచ్చటించుకోవాలి. ఈ సినిమా ఓ కాన్సెప్టుతో తీశారు. సినిమా కాన్సెప్టు ఆడియన్స్‌కి కనెక్టు అయితే ఎండ్‌ రిజల్ట్‌ ఎలా వుంటుందనడానికి నిదర్శనం ఈ సినిమా. ‘‘స్వామిరారా, కార్తికేయ’’ వరుస హిట్స్‌ ఇచ్చిన నిఖిల్‌కి ఇది హేట్రిక్‌! వాస్తవానికి ఫొటోగ్రఫీ - మ్యూజిక్‌ ఈ సినిమాకి హీరో హీరోయిన్లు! డైలాగ్స్‌ అడిషనల్‌ ఫ్లేవర్‌!!

‘టెంపర్‌ - సూర్య వర్సెస్‌ సూర్య’ : రెండు భిన్న ప్రపంచాలు!

లీడిరగ్‌ హీరో స్థానాన్ని నిలుపుకోవడానికి ఏం చేయగూడదో ‘టెంపర్‌’ చెప్పింది. అప్‌కమింగ్‌ హీరో తన స్థానాన్ని ఇంప్రూవ్‌ చేసుకోవడానికి ఏం చేయాలో ‘సూర్య వర్సెస్‌ సూర్య’ చెప్పింది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement