Advertisementt

టీ-అసెంబ్లీలో ఘర్షణ దేనికి సంకేతం..!!

Sat 07th Mar 2015 06:18 AM
telanagan assembly,fighting,budget session  టీ-అసెంబ్లీలో ఘర్షణ దేనికి సంకేతం..!!
టీ-అసెంబ్లీలో ఘర్షణ దేనికి సంకేతం..!!
Advertisement
Ads by CJ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తీవ్ర ఘర్షణలమధ్య ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి టీడీపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకురాగా.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఈ ఇరువర్గాల మధ్య  ఘర్షణ ప్రారంభమైంది. ఒకరినొకరు తోసుకోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌లు కిందపడినట్లు సమాచారం. ఇక  టీడీపీ ఎమ్మెల్యేలకు మద్దతుగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్‌ వర్గ నాయకులను అడ్డుకోవడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో ఇంతటి దారుణ పరిస్థితి ఎప్పుడూ లేదని, ఇక భవిష్యత్తులో తెలంగాణ శాసన సభను కేసీఆర్‌ బీహార్‌, యూపీ, తమిళనాడు అసెంబ్లీ మాదిరిగా నడిపించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ